Thursday, June 11, 2026
Homeసినిమావీరమల్లు ఒక పార్టా..? రెండు పార్టులా..?

వీరమల్లు ఒక పార్టా..? రెండు పార్టులా..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో పవన్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆమధ్య రిలీజ్ చేసిన వీరమల్లు టీజర్ అండ్ మేకింగ్ వీడియో సినిమా పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. అయితే.. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన వీరమల్లు కొన్ని కారణాల వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.

ఇటీవల వీరమల్లు రెండు పార్టులుగా రానుందని వార్తలు వచ్చాయి. ఒక పార్ట్ కంప్లీట్ అవ్వడానికే ఇంత టైమ్ తీసుకుంటుంటే.. ఇక రెండు పార్టులుగా సినిమా అంటే ఇంకెంత ఆలస్యం అవ్వచ్చో ఊహించుకోవచ్చు. అయితే.. వీరమల్లు రెండు పార్టులుగా రానుందని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది నిజమేనా..? లేక రూమరా..? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవం ఏంటని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే… ఈ సినిమా కథలో పార్ట్ 2 కి పాజిబులిటీ ఉందట కానీ.. డెఫినెట్ గా పార్ట్ 2 ని తెరకెక్కించే ఆలోచన ఇప్పట్లో లేదట.

మొదటి భాగం పూర్తై.. రిలీజై.. హిట్ అయితే… తర్వాత పవన్ కూడా ఓకే అంటే అప్పుడు వీరమల్లు పార్ట్ 2 గురించి ఆలోచిస్తారట. అంతే తప్పా.. ఇప్పటికిప్పుడు పార్ట్ 2 తీయాలి అనుకోవడం లేదట. సో దాదాపు హరిహర వీరమల్లు ఒక్క పార్ట్ గానే వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కి రావాల్సిన ఈ సినిమా దసరాకి వస్తుంది అంటున్నారు. మరి.. దసరాకి అయినా వస్తుందో లేదో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular