Thursday, June 18, 2026
Homeసినిమాబాలయ్య ఫంక్షన్ కి గెస్ట్ గా పవర్ స్టార్?

బాలయ్య ఫంక్షన్ కి గెస్ట్ గా పవర్ స్టార్?

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మూడు పాటలు ఒక పాటను మించి మరో పాట సక్సెస్ అవ్వడంతో వీరసింహారెడ్డి  ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాయలసీమలో ఈ వేడుక చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు.? ఎక్కడ..? అనేది త్వరలో ప్రకటించనున్నారు. అయితే.. బాలయ్య వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న వీర‌సింహారెడ్డి పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే వీరసింహారెడ్డి పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తే.. మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా బాలయ్య వేడుకకు పవర్ స్టార్ వస్తారా..?  లేక వేరే స్టార్ ఈ వేడుకకు వస్తారా..?  క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular