21.3 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeసినిమాPawan, Surender: పవన్, సురేందర్ రెడ్డి మూవీ ప్రారంభం

Pawan, Surender: పవన్, సురేందర్ రెడ్డి మూవీ ప్రారంభం

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆతర్వాత భీమ్లా నాయక్, బ్రో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డితో కూడా ఓ సినిమాను గతంలో ప్రకటించారు. ఆతర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం.. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఇక ఈ సినిమా ఉండదేమో అనుకున్నారు.

అయితే.. పవన్, సురేందర్ రెడ్డి కాంబో మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఈ సినిమా ఉందని చెప్పకనే చెప్పారు. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఇది ఏ తరహా కథ..? పవన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? ఇవేమీ బయటకు రాలేదు కానీ.. ఈ సినిమా కథ మాత్రం పవర్ ఫుల్ గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఈ మూడు చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ చేయాలి. ఆతర్వాత సురేందర్ రెడ్డితో చేయనున్న మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది. మరి.. ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్