Monday, June 8, 2026
Homeసినిమాపవన్, సురేందర్ రెడ్డి మూవీ ఏమైంది..?

పవన్, సురేందర్ రెడ్డి మూవీ ఏమైంది..?

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. సక్సెస్ సాధించాడు. ఆతర్వాత ‘భీమ్లా నాయక్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోసారి విజయం సాధించాడు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పవర్ స్టార్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీంతో ఎప్పుడెప్పుడు వీరమల్లు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్ లోనే ఉన్న ఈ మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. దసరాకి వస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవర్ స్టార్ వరుసగా కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ప్రారంభించారు. సుజిత్ డైరెక్షన్ లో ‘ఓజీ’ మూవీని ప్రారంభించారు. సముద్రఖని డైరెక్షన్ లో ‘వినోదయ సీతం’ రీమేక్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా కొత్త సినిమాలకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. అయితే.. సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. ఈ చిత్రానికి నిర్మాత రామ్ తళ్లూరి. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మాఫియా మూవీగా దీన్ని అప్పట్లో చెప్పుకున్నారు. ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు.

ఇంత జరిగిన తర్వాత ఆ సినిమా పై ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం ముహూర్తం కూడా జరగలేదు. అయితే.. ఈ మొత్తం వ్యవహారానికి పవన్ కారణం కాదని తెలుస్తోంది. విషయం ఏంటంటే.. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టుకోమని నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. ఓపెనింగ్ కు కూడా వస్తానని చెప్పాడట కానీ.. నిర్మాతే వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ముహూర్తం షాట్ కొట్టినప్పటికీ, రెగ్యులర్ షూట్ మొదలవ్వడానికి చాలా టైమ్ పడుతుందనే విషయం రామ్ తళ్లూరికి తెలుసు. అందుకనే పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఇంట్రస్ట్ చూపించలేదట. మరి.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందో ఉండదో.. క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Also Read : పవన్, సుజిత్ మూవీ వెనుకున్న సీక్రెట్ ఇదేనా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular