Saturday, January 18, 2025
Homeసినిమాపవర్ స్టార్ క్లాప్ తో విశ్వక్ చిత్రం ప్రారంభం

పవర్ స్టార్ క్లాప్ తో విశ్వక్ చిత్రం ప్రారంభం

Power Clap: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడి గా ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక గా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15లో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. తొలి షాట్ కి వెటరన్ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు విష్ణు స్క్రిప్ట్ ని హ్యాండోవర్ చేశారు. వీరితో పాటు బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై టీమ్ కి బెస్ట్ విశేష్ అందించారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అర్జున్ గారు కలవాలని అడిగితే షాక్ అయ్యా. ఎందుకో అర్ధం కాలేదు. ‘నేను డైరెక్ట్ చేస్తున్న కథ చెప్తా విను’ అనగానే చాలా సర్ ప్రైజ్ అయ్యా. ఇది నా విష్ లిస్టులో వున్న సినిమా. అంత గొప్ప కథ. ఈ సినిమా కథ అన్నిటికంటే పెద్దగా కనిపించింది. ఈ కథకు నన్ను ఎంపిక చేసిన అర్జున్ గారికి ధన్యవాదాలు. మా అమ్మగారు అర్జున్ గారికి పెద్ద అభిమాని. తెలుగు సరిగ్గా రాదని చెబుతూనే ఐశ్వర్య అద్భుతమైన తెలుగు మాట్లాడారు. నన్ను, అర్జున్ గారిని డామినేట్ చేయడానికి ఐశ్వర్య రెడీ అవుతున్నట్లుగా వుంది. రవి బసూర్ గారితో ఇంత త్వరగా సినిమా చేస్తానని అనుకోలేదు. బుర్రా సాయి మాధవ్ గారితో పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, రాఘవేంద్రరావు గారికి, విష్ణు గారికి, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు” తెలిపారు.

అర్జున్ సర్జా మాట్లాడుతూ”ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమకి నా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ ని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా వుంది. తను ఒక తమిళ్ సినిమా, నా దర్శకత్వంలో ఒక కన్నడ సినిమా చేసింది. ఇప్పుడీ తెలుగు సినిమా చేయబోతుంది. తను చాలా డెడికేటెడ్ గా పని చేస్తుంది. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కష్టపడి పని చేస్తుందనే నమ్మకం వుంది. ఇది చాలా ఫీల్ గుడ్ మూవీ. చాలా అరుదైన జోనర్. ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా నటులు, టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు. అందరికీ ఇంత నమ్మకం వున్నపుడు ఖచ్చితంగా అద్భుతమైన సినిమా చేయాలనే భయం వుంది. మా హీరో విశ్వక్ వండర్ ఫుల్ హీరో. ఈ కథ విన్నాక పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అని హీరో విశ్వక్ చెప్పారు. అప్పుడు ఇంకా భాద్యత పెరిగినట్లనిపించింది. వందశాతం మంచి సినిమాని తీస్తాను. ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ ఫీల్ గుడ్ మూవీ. దర్శకుడిగా ఇది 13వ సినిమా. నిర్మాతగా 15వ సినిమా” అన్నారు.

Also Read :  ప్రేక్షకులకు ‘ధమ్కీ’ ఇవ్వనున్న విశ్వక్ సేన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్