Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇది మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీకి రీమేక్. యంగ్ టాలెంట్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమా చిత్రయూనిట్ త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఎప్పుడు రిలీజ్ చేసేది అనౌన్స్ చేయలేదు.

అయితే… తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నారని తెలిసింది. ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం థమన్ ట్యూన్లు రెడీ చేయడంలో బిజీగా ఉన్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ మల్టీస్టారర్ మూవీని సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com