పవన్ కు ప్యాకేజీ డీల్ కుదిరింది: దాడిశెట్టి

పవన్ కళ్యాణ్ ను చిరంజీవికి తమ్ముడు అనాలా, చంద్రబాబుకు దత్తపుత్రుడు అనాలా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశించారు. పవన్ కు టీడీపీతో డీల్ ఓకే అయిపోయిందని, గత మూడు  రోజులుగా అయన పిచ్చి వాగుడు ద్వారా ఇది స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. అసలు జనసేన అనేది చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల పుట్టిన పార్టీ అని కాబట్టే, పవన్ కల్యాణ్ తనకు కులం లేదంటాడు, మతం లేదంటాడు, ప్రాంతం లేదంటాడని, అతనికి ఉన్నది చంద్రబాబు, కావాల్సింది ప్యాకేజీ మాత్రమేనని విమర్శించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని పవన్ చెబుతున్నారని, తాము 2019లోనే టీడీపీ విముక్త, జనసేన విముక్త ఆంధ్రప్రదేశ్ చేసి చూపించామని అందుకే పవన్ కల్యాణ్ కు మెంటల్ ఎక్కిందని దుయ్యబట్టారు. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో బాబు కోసం పోటీ చేస్తున్నావా లేక నీ కోసం నువ్వు పోటీ చేస్తున్నావా.. అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పడంలేదని ఎద్దేవా చేశారు.  175కు 175 ఎమ్మెల్యే సీట్లలో, 25కు 25 లోక్ సభ సీట్లలో నీ బీ-ఫామ్ మీద అభ్యర్థులను నిలబెడుతున్నావా లేదా అంటే, దానికీ సమాధానం లేదని రాజా వ్యాఖ్యానించారు.

తననుకాక, మరో సినీ నటుడ్ని నిన్నఅమిత్ షా కలవటంతోనే పవన్ కల్యాణ్ కు ఇక టీడీపీ వైపు వెళ్ళిపోవాలన్న ఆత్రం మరింత పెరిగినట్టు ఉందన్నారు. సంసారం ఒకరితో… శృంగారం మరొకరితో అన్నట్టు బీజేపీ మిత్ర పార్టీగా చెబుతూనే ప్రతిరోజూ చంద్రబాబు డైలాగులనే వల్లె వేస్తున్నాడంటే… పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ కుదిరిందని, పర్యటన కూడా బహుశా టీడీపీ కోసం, టీడీపీ చెప్పినట్టు, టీడీపీ చెప్పిన నియోజకవర్గాల్లో టీడీపీ డైలాగులతో, స్క్రిప్టుతో కొనసాగుతుందన్నారు.

అసలు మంగళగిరిలో వన్ కల్యాణ్ కు వేరే ఆఫీసు ఎందుకని, ఈ మీటింగ్ ఏదో టీడీపీ ఆఫీసులోనే పెట్టుకుంటే పోయేది కదా అని చమత్కరించారు.  ఇప్పుడున్నది కూడా జనసేన కాదు. అదంతా నారా-నాదెండ్ల సేన అని…గ్లాసు బాబుది.. డోస్ పవన్ కు అని దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు.

Also Read : ఉపయోగం లేకపోతే…: కొడాలి కామెంట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *