చంద్రబాబులో అభద్రతా భావం పెరిగిందని, అందుకే మంత్రివర్గ కూర్పుపై కూడా విమర్శలు చేసే స్థాయికి దిగజారారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యం కల్పించిన చరిత్ర జగన్ కు దక్కుతుందన్నారు. పవన్ కళ్యాణ్ పైనా సురేష్ విమర్శలు చేశారు. ఎవరైనా పార్టీ పెట్టిపెట్టినప్పుడు అ పార్టీకంటూ కొన్ని సిద్ధాంతాలు, జెండా, అజెండా ఉంటాయని… కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరి పల్లకీయో మోయడానికి పార్టీ పెట్టారని మండిపడ్డారు/
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తామంతా జగన్ బొమ్మతో గెలిచిన వాళ్ళమేనని వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన వారికి, ఆశించి స్థానం లభించని వారికి సహజంగా కొన్ని భావోద్వేగాలు ఉంటాయని వాటిని అర్ధం చేసుకోవాలని, నిదానంగా అన్నీ సర్దుకుంటాయని అఆశాభావం వ్యక్తం చేశారు. కేబినేట్ మొత్తాన్ని మారుస్తానని జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంత్రులందరం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా గా చెప్పారు సురేష్.
ప్రకాశం జిల్లాలో బానినేని శ్రీనివాసరెడ్డికి, తనకు ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం కలిసి జిల్లాలో వైసీపీ బలోపేతం కోసం పని చేస్తామని, జగన్ ఆలోచనల మేరకు నడచుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : అమ్మ ఒడిపై దుష్ప్రచారం తగదు : మంత్రి సురేష్