Friday, April 19, 2024
Homeసినిమాఏప్రిల్ 'ప‌వ‌ర్' షెడ్యూల్స్ మొదలు

ఏప్రిల్ ‘ప‌వ‌ర్’ షెడ్యూల్స్ మొదలు

Busy Schedule: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫిబ్ర‌వ‌రిలో భీమ్లా నాయ‌క్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించింది. ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ గా బిజీ అయ్యారు. అయితే.. ఇప్పుడు వ‌రుస‌గా రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీ కానున్నార‌ని స‌మాచారం.

ఇంత‌కీ ఆ రెండు సినిమాలు ఏంటంటే.. ముందుగా ఆయన హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ మొదలుపెడుతారు. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. క్రిష్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ఈ సినిమాని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. ద‌స‌రాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.

ఈ సినిమాతో పాటు వినోదయా సితం అనే తమిళ్ చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తారు. ఈ సినిమాకి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే రాస్తున్నారు. పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించనున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే ప్రారంభం అవుతాయి. ఇవి పూర్తయిన తర్వాతే మిగతా సినిమాల గురించి ఆలోచిస్తారని స‌మాచారం.

Also Read : పవన్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన క్రిష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్