Tuesday, September 17, 2024
HomeTrending Newsహైడ్రా పెట్టి రేవంత్ మంచి పని చేశారు: పవన్ కళ్యాణ్

హైడ్రా పెట్టి రేవంత్ మంచి పని చేశారు: పవన్ కళ్యాణ్

వరద తాకిడికి గురైన గ్రామాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు, పారిశుధ్య పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. సిఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించిన రూ కోటి రూపాయలకు అదనంగా ఈ సాయం అందిస్తున్నారు. 400 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి లక్ష రూపాయల చొప్పున నేరుగా అందించాలని, ఈ నిధులను ఆయా పంచాయతీల అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించారు. దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నట్లు పవన్ ప్రకటించారు. వరద పరిస్థితిపై సమీక్షించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.

వరద ప్రాంతాల్లో తాను పర్యటిస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే, అధికారుల సూచన మేరకు తాను వెళ్ళడంలేదని పవన్ పునరుద్ఘాటించారు.  వైసిపి నాయకులు ఇంకా ఎవరైనా విమర్శించాలని అనుకుంటే  భవిష్యత్తులో తనతో పాటు పరామర్శకు రావొచ్చని, తన కాన్వాయ్ లో తీసుకెళ్తానని, తనతో నడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమవుతుందని వ్యాఖ్యానించారు.  రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న సహాయ కార్యక్రమాలపై విమర్శలు చేయాలనుకున్న వారు…మొదట వళ్ళు వంచి ప్రజలకు సాయం చేసి ఆ తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. ఇళ్ళలో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడితే సరిపోదన్నారు.

హైడ్రాపై కూడా పవన్‌ స్పందించారు, హైడ్రా పెట్టి రేవంత్‌ మంచి పనిచేశారని, అసలు అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
హైడ్రాలాంటివి కచ్చితంగా ఉండాలని,  ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చేయాలని,  మానవతా కోణంలో కూడా చూడాలబని అన్నారు. మరో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా కట్టకుండా..
బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాలన్నారు. ఏపీలో కూడా ఆక్రమణలు తొలగించేందుకు ఏమి చేయాలో ఆలోచిస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్