Monday, February 24, 2025
Homeసినిమాపెళ్లిళ్ల గురించి అసలు విషయం బయటపెట్టిన పవర్ స్టార్

పెళ్లిళ్ల గురించి అసలు విషయం బయటపెట్టిన పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకులకు ఇదే ఆయుధం అయ్యింది. పవన్ కళ్యాణ్‌ ని విమర్శించాలంటే ఈ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువస్తుంటారు. అయితే.. ఇటీవల పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోకు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ షోకు పవర్ స్టార్ గెస్ట్ గా వస్తున్నారనే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు.

రీసెంట్ గా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. పవనేశ్వర .. పవరేశ్వరా అంటూ పవన్ ను బాలయ్య ప్రశంసించడం .. ఆయన మేనరిజంను ప్రత్యక్షంగా చూడాలని ఉందంటూ పట్టుబట్టడం ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశాలుగా కనిపించాయి. మెగా ఫ్యామిలీలో తన తల్లి .. వదిన .. చరణ్ .. సాయితేజ్ .. వైష్ణవ్ తేజ్ గురించి పవన్ కళ్యాణ్‌ ప్రస్తావించాడు. ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా?’ అంటూ పవన్ ను బాలయ్య సూటిగా అడిగారు. అందుకు పవన్ స్పందిస్తూ .. జీవితంలో అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నాను. బ్రహ్మచారిగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఏం చేస్తాం.. అలా జరిగిపోయాయి అని చెప్పారు.

రాజకీయాలలో చాలా మంది నన్ను ఈ పెళ్లిళ్ల విషయంలోనే టార్గెట్ చేస్తుంటారు కానీ.. నేనేమీ ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. ఒకేసారి ముగ్గురితో కలిసి ఉండటం లేదే అని చెబుతున్నా వినిపించుకోరు. ఒకరితో నాకు కుదరదని అనుకున్నప్పుడు నేను విడాకులు ఇచ్చేసి చట్టబద్ధంగా మరో పెళ్లి చేసుకున్నాను. అంతే తప్పా వ్యామోహంతో చేసుకోలేదు. నన్ను టార్గెట్ చేయడానికి మరో అంశం లేకపోతే అవతలవారు మాత్రం ఏం చేస్తారు పాపం .. అననీయండి. ఈ విషయం పై ఘాటుగా స్పందించడానికి నాకు నా సంస్కారం .. సభ్యత అడ్డొస్తుంటాయి. అందువలన నా పనిని నేను చేసుకుపోతుంటాను అంతే అని చెప్పారు. దీంతో ఇక పై పవన్ పెళ్లిళ్ల గురించి ఎవరు మాట్లాడినా అంటూ బాలయ్య తనదైన స్టైల్ లో ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్