Wednesday, March 12, 2025
Homeసినిమాపవన్, సముద్రఖని రెండో ప్రాజెక్ట్ రెడీ?

పవన్, సముద్రఖని రెండో ప్రాజెక్ట్ రెడీ?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్  నటిస్తోన్న చిత్రం ‘బ్రో’.  సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్  ప్లే – సంభాషణలు అందించారు. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈమధ్య కాలంలో ఇంత ఫాస్ట్ గా షూటింగ్ పూర్తయిన సినిమా ఇదేనేమో. సముద్రఖని. తన అనుభవాన్ని ఉపయోగించి పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైమ్ కి  కంప్లీట్ చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది. అందుకనే సముద్రఖనికి  పవన్ మరో ఆఫర్ ఇచ్చారని సమాచారం.

బ్రో సినిమా వినోదయ సీతమ్ కు రీమేక్. ఈసారి రీమేక్ కాకుండా.. స్ట్రైయిట్ మూవీ చేయాలనుకుంటున్నారట. పవన్ ఇప్పుడు తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. సముద్రఖని కూడా తక్కువ టైమ్ షూటింగ్ పూర్తి చేయడంతో పాటు సరికొత్త మేకింగ్ తో ఉంటాయి. జులై 28న ‘బ్రో’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని  తర్వాత పవన్, సముద్రఖని కొత్త సినిమా గురించి ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తుంది.

అయితే.. పవన్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత పొలిటికల్ గా బిజీ కానున్నారు.  సెట్స్ పై ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్లీ సముద్రఖని డైరెక్షన్ లో మూవీ అంటే.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..? ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. కాకపోతే.. పవన్ చేయాలి అనుకుంటే.. ఎలాగైనా టైమ్ కుదుర్చుకుని మరీ చేస్తారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా సముద్రఖనితో మరో సినిమా చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్