‘ఆదిపురుష్’ షో కు రణ్ బీర్ భారీ బుకింగ్!

ప్రభాస్, ఓంరౌత్ కాంబోలో తెరకెక్కిన  చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఆధారంగా రూపొందిన  ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలున్నాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రేక్షకుల్లో ఆదిపురుష్ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. జూన్ 16నప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. యు.ఎస్. లో కూడా భారీగా ప్రమోషన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ నిరుపేద పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూపించడానికి 10,000 టిక్కెట్లను బుక్ చేయనున్నారు. ఈ నిర్ణయం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ మరియు UV క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాకర్టీ సంస్థ రిలీజ్ చేస్తోంది.

అభిషేక్ నామా కూడా 10,000 టిక్కెట్లను కొని పిల్లలకు, అనాధలకు, వృద్ధులకు ఇవ్వనున్నారు. మొత్తానికి ఆదిపురుష్ చిత్రానికి రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం పట్ల తమకున్న ప్రేమను ఈవిధంగా చూపిస్తున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశమంతా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ పండితులు చెబుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ప్రస్తుతం ఆదిపురుష్ మూవీకి ఉన్న క్రేజ్ ను చూస్తుంటే.. బాహుబలి రేంజ్ సక్సెస్ రావడం ఖాయం అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *