Friday, March 6, 2026
HomeTrending Newsసింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన అనా కొణిదెల

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన అనా కొణిదెల

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమెకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో  నేడు జరిగిన స్నాతకోత్సవంలో అనా తన డిగ్రీ పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి పవన్ అభినందనలు తెలిపారు.

శ్రీమతి అనా కొణిదెల రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను హానర్స్ పట్టా పొందారు.  ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో శ్రీమతి అనా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular