Friday, April 26, 2024
Homeసినిమాఆచార్య వేడుక‌కు అతిథి ఎవ‌రు?

ఆచార్య వేడుక‌కు అతిథి ఎవ‌రు?

Who’s the Guest?: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ, క్రేజీ మూవీ ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 29న ఆచార్య ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక‌ను ఈ నెల 23న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్మాతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే..  ఈ వేడుక‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత అది వాస్త‌వం కాద‌ని తెలిసింది. తాజా అప్ డేట్ ఏంటంటే.. అన్న‌య్య చిరంజీవి వేడుక‌ కోసం త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రానున్నార‌ని స‌మాచారం. ఈ వేడుకకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిసింది. అన్నదమ్ములిద్దరూ ఒకే వేదిక పై కనిపించనున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఆ వేడుక కోసం మెగా ఫ్యాన్స్  ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్