Wednesday, March 18, 2026
Homeసినిమా'ఉస్తాద్ భగత్ సింగ్' అప్ డేట్ ఏంటి..?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్ డేట్ ఏంటి..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ అయితే.. అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందా..? అసలు ఎంత వరకు వచ్చింది..? లేటెస్ట్ అప్ డేట్ ఏంటి అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ ‘బ్రో’, ‘ఓజీ’, వీరమల్లు షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ హైలెట్ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఏంటా హైలెట్ అంటే… ఈ సినిమాలో హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ అదిరిపోయాయని.. ముఖ్యంగా పవన్ ఒరిజినల్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉండేలా డైలాగ్స్ రాశారని.. ఈ డైలాగ్స్ థియేటర్లో తూటాల్లా పేలతాయని సినిమా మొత్తానికి డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. అలాగే పవన్, శ్రీలీల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని తెలిసింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్, హరీష్‌, దేవిశ్రీ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజికల్ గా కూడా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ ఉంటుందట. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. డిసెంబర్ లో ఓజీ విడుదల చేయనున్నారు. ఈ లెక్కన ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే సమ్మర్ లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular