Thursday, September 19, 2024
Homeసినిమా'హరిహర వీరమల్లు'లో మొదలైన కదలిక!

‘హరిహర వీరమల్లు’లో మొదలైన కదలిక!

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ‘హరిహర వీరమల్లు’ షూటింగు మొదలై చాలా కాలమైంది. ఎ.ఎమ్. రత్నం నిర్మాతగా .. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ కల్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన లుక్ మంచి మార్కులు కొట్టేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అభిమానులు ఆసక్తిని చూపుతూ వచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా షూటింగు ముందుకు వెళ్లలేదు.

కరోనా కారణంగా .. ఆ తరువాత రాజకీయాలలో పవన్ బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. మధ్య మధ్యలో పవన్ సెట్స్ పైకి వచ్చాడు. కానీ అవి చాలా చిన్న షెడ్యూల్స్ కావడం వలన, ఈ ప్రాజెక్టులో ప్రోగ్రెస్ కనిపించలేదు. ఈ ప్రాజెక్టు ఆపేస్తున్నారనే టాక్ కూడా వచ్చింది. ఈ లోగా పవన్ వేరే ప్రాజెక్టులకు సైన్ చేయడం కూడా ఈ సందేహం బలపడేలా చేసింది. అలాంటి ఈ ప్రాజెక్టులో ఇప్పుడు కదలిక మొదలైందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా మేకర్స్ పవన్ కల్యాణ్ ను కలవడం .. ఈ ఏడాది చివరికి విడుదల చేయాలనే విషయాన్ని చెప్పినట్టుగా సమాచారం. పవన్ 20 రోజుల పాటు డేట్స్ కేటాయించాడట. ఈ 20 రోజులలో ఆయన పోర్షన్ పూర్తవుతుందని అంటున్నారు. ఈ నెల 23 నుంచి ‘విజయవాడ’ సమీపంలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగు మొదలై, అక్టోబర్ 5 వరకూ కొనసాగుతుందని చెబుతున్నారు. ఆ తరువాత ‘OG’ .. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్టులు కూడా ముందుకు కదులుతాయని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్