Thursday, March 28, 2024
HomeసినిమాPavan - Bro: పవన్ మూవీకి టైటిల్ 'బ్రో'?

Pavan – Bro: పవన్ మూవీకి టైటిల్ ‘బ్రో’?

పవన్ మూవీకి టైటిల్ బ్రో.. ఇది నిజమా..?పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఒక పాట మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సముద్రఖనికి సీరియల్స్ చేసిన అనుభవం ఉండడంతో పక్కా ప్లానింగ్ తో ఏమాత్రం టైమ్ వేస్ట్ కాకుండా అనుకున్నట్టుగా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు.

‘వినోదయ సీతమ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించలేదు కానీ.. ‘ దేవుడే దిగి వచ్చినా’, ‘దేవర’, ‘దేవుడు’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ‘బ్రో’  అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ బ్రో అని పిలుచుకుంటారట.  కాబట్టి ఈ టైటిల్ కథకు సరిగ్గా సెట్ అవుతుందని  దీన్నే ఫైనల్ చేశారట. ఈ వారంలోనే  అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇదేం టైటిల్ బ్రో.. టైటిల్ మార్చండి బ్రో అనే కామెంట్లు ఫాన్స్ నుంచి వస్తున్నాయి. అయితే.. మేకర్స్ మాత్రం ఇదే ఫిక్స్ అయ్యారట.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్