టాలీవుడ్ తెరపై పొడగరి కథానాయికల జాబితాలో పాయల్ రాజ్ పుత్ కూడా కనిపిస్తుంది. మంచి హైట్ ఉండటం వలన చీరకట్టులో కట్టిపడేసే అందగత్తెలలో కూడా పాయల్ ఒకరిగా మెరుస్తుంది. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో ఎంత మాత్రం మొహమాటం లేకుండా ఈ సుందరి అందాలు అరబోయడంతో, కుర్రాళ్లంతా ఆమె అభిమానుల జాబితాలో పొలోమంటూ చేరిపోయారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక ఇక్కడ పాయల్ ను పట్టుకోవడం కష్టమేనని అనుకున్నారు. కానీ పాయల్ ఆ స్థాయి దూకుడును చూపించలేకపోయింది.

పాయల్ ‘వెంకీమామ’ .. ‘డిస్కోరాజా’ వంటి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఆమె కెరియర్ కి అంతగా ఉపేయోగపడలేదు. ఈ నేపథ్యంలో ఆమె ‘సీత’ సినిమాలో ఐటమ్ సాంగ్ లోను మెరిసింది. ఆ తరువాత వెబ్ సిరీస్ ల వైపు కూడా వెళ్లింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోను వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘తీస్ మార్ ఖాన్’ రెడీ అవుతోంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.

అయితే పాయల్ మరింత సన్నబడిపోయి .. ఆకర్షణ కోల్పోయి కనిపించింది. నిజానికి తన హైటుకి తగిన బరువు ఉంటే పాయల్ మంచి అందగత్తెనే. కానీ నాజూకుతనం పేరుతో ఆమె మరింత సన్నబడటంతో కుర్రాళ్లు ఇచ్చే మార్కులు  తగ్గిపోతున్నాయి. ఇప్పటికే ఆమె హైటు కారణంగానే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆమె బరువు తగ్గేసి ఉన్న గ్లామర్ కూడా పోగొట్టుకుంటే ఇప్పుడు వస్తున్న అవకాశాలు ఇక ముందు వస్తాయనేది సందేహమే. అందుకే పాయల్ ఇప్పటికైనా కాస్త కళ్లు తెరవాలి .. కండపట్టాలి .. లేదంటే ఇబ్బందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *