Thursday, March 19, 2026
Homeసినిమా'గాలి' తో జత కట్టిన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్

‘గాలి’ తో జత కట్టిన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్

Hot Girls:  మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు‘ గా లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుక గా సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే… పాయల్, సన్నీలియోన్ గెటప్ లను కూడా కార్టూన్ రూపంలో విడుదల చేశారు.
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular