Saturday, January 18, 2025
Homeసినిమా'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై పాయల్ 'రక్షణ' 

‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పై పాయల్ ‘రక్షణ’ 

పాయల్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ‘RX 100’ సినిమాతో హాట్ బ్యూటీగా పాయల్ మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత ఒక వైపున సినిమాలు .. మరో వైపున వెబ్ సిరీస్ లు చేస్తూ వెళుతోంది. అప్పుడప్పుడు నాయిక ప్రధానమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగానే ఉంది. ఆమె నుంచి వచ్చిన సినిమానే ‘రక్షణ’. ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, రేపటి నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో పాయల్ కనిపించనుంది. కథ గురించి చెప్పకోవాలంటే, ‘ నగరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడిని పట్టుకునే బాధ్యత ఏసీపీ కిరణ్ (పాయల్)కి అప్పగిస్తారు. ఓ సైకో ఈ హత్యలన్నిటికీ కారణమనే విషయాన్ని ఆమె కనిపెడుతుంది. ఆ హంతకుడిని పట్టుకునే పనిలో ఉండగా, ఆమెను సస్పెండ్ చేస్తారు.

కిరణ్ ను ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఆమె చేసిన పొరపాటు ఏమిటి? తనని సస్పెండ్ చేసినందుకు కిరణ్ మౌనంగా ఉంటుందా? లేదంటే యూనిఫామ్ కి దూరంగా ఉంటూనే హంతకుడిని పట్టుకుంటుందా? అనేది కథ. పాయల్ మంచి హైట్ .. అందుకు తగిన పర్సనాలిటీతో ఉంటుంది. అందువలన పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోయిందనే టాక్ వచ్చింది. ఇక కథాకథనాల పరంగా ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్