Saturday, November 23, 2024
HomeTrending NewsKarnataka: రేపు కర్ణాటక సిఎల్ పి సమావేశం

Karnataka: రేపు కర్ణాటక సిఎల్ పి సమావేశం

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం ఖరారు అయ్యింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నాలు చేసుకుంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించటం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అభినందనలు తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్.

కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకకు ఎన్నికలు జరుగగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 సాధించాల్సి ఉంది. వాటిలో దాదాపు 103 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మొత్తం 140 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా దూసుకుపోతోంది. దీంతో దక్షిణ భారతంపై పట్టు సాధించాలనుకున్న బీజేపీ చతికిలపడింది.

విజయం ఇక నామమాత్రపు ప్రకటనే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది. దీని కంటే ముందు తమ అభ్యర్ధులను బెంగళూరు తరలిచింది. విజయంపై ఆనందంలో తేలిపోతున్న కాంగ్రెస్ సీఎల్పీలో సీఎం అభ్యర్థిని రేపటి సమావేశంలో ఎంపిక చేయనుంది. హోటల్ హిల్టన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎల్పీ భేటీ కానుంది. సీఎం రేసులో ప్రధానంగా కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. కర్ణాటకలో మే 15న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. శాసనసభ ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారం చేపట్టనుంది. అయితే, సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో సీఎం ఎవరనే ఉత్కంఠ నెలకుంది. డీకే శివకుమార్ జన్మదినం రోజునే సర్కారు కొలువుదీరనుండగా.. ఆయనకు అధిష్ఠానం పుట్టిన రోజు కానుక ఏం ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్