Sunday, January 19, 2025
HomeTrending Newsకేసియార్ కు అలవాటే: రేవంత్

కేసియార్ కు అలవాటే: రేవంత్

ఎన్నికలకు ముందు పథకాలు ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత వాటిని ఎగ్గొట్టడం సిఎం కేసియార్ కు అలవాటని పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి  విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ఒక్కొక్క కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తానని ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది.

ఈ భేటీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • హైదరాబాద్ లో 10 వేలు ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఎలా ఇస్తారని మనం ప్రశ్నించాలి
  • ప్రభుత్వాలు ఏ పథకం ప్రవేశ పెట్టిన కూడా అధికంగా లబ్ది పొందేది దళిత, గిరిజనులు
  • కాంగ్రెస్ ప్రభుత్వలు అనేక పథకాలు ప్రవేశ పెట్టి దళితుల ఆత్మ గౌరవాన్నికాపాడాం
  • కాంగ్రెస్ పథకాలను కేసియార్ నిలిపివేశారు
  • కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీయింబర్స్మెంట్ కెసియార్ నిలిపేశారు. దాని వల్ల దళిత, గిరిజన పేదలు విద్య కు దూరమయ్యారు
  • ఆరోగ్య శ్రీ ఆపేశారు దానితో పేదలు మంచి వైద్యానికి దూరమయ్యారు
  • బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమలు చేసి ఉంటే వేలాది దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మ గౌరవంతో బతికేవి
  • కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు పేరుతో ఒక పథకాన్ని, ఒక నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు
  • ఈ విషయాలపై మనం ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా మనం నిలదీయాలి
  • ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తారు తర్వాత ఎగ్గొడుతారు
  • అందుకే మనం ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలి
  • డీసీసీ లు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలి
  • ఈ విషయంలో సామాజిక కోణం ఉంది
  • నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయాలి
  • బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది
  • 119 నియోజక వర్గాలకు ఇంచార్జి కు ఎలా పని చేశారో వారి.పనితీరుకు ఇదో కొలబద్ద
  • క్షేత్ర స్థాయిలో పని చేసిన వారి పనితీరు తోనే పార్టీ బాగు పడుతుంది
  • 17 పార్లమెంట్ లో ప్రత్యేక నివేదికలు తయారు చేస్తాం
  • ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజక వర్గంలో వారి పనితీరు పైన నివేదిక ఇవ్వాలి
  • మండలాల అధ్యక్షుల పనితీరు బాగుండాలి. వారు గట్టిగా పనిచేస్తే నియోజకవర్గంలో గెలవడం సులువు
  • మండల అధ్యక్షలు మండల అధికారుల నుంచి పని చేయించగలగాలి
  • పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలి
  • నియోజక వర్గంలో ఉన్న నాయకలుకు సమన్వయ కర్తలు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్