తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాన ఇన్ ఛార్జ్  ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే  నేడు రెండో రోజు కూడా పలువురు నేతలతో సమావేశం కానున్నారు.  నిన్న తొలిరోజు బిజీ బిజీగా ఆయన షెడ్యూల్ సాగింది. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగింది. నేటి ఉదయం 10:30 గంటలకు మరోసారి ఈ  కమిటీ తో  అయన భేటీ కానున్నారు. ఆ తర్వాత డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్ తో సమావేశమవుతారు.

నిన్న  నాలుగున్నర గంటల పాటు సాగిన పీఏసీ సమావేశంలో నేతలకు సుతిమెత్తగా  థాక్రే హెచ్చరికలు చేశారు.

నేతలంతా క్రమశిక్షణతో మెలగాలని,  దేశం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే మీరు గొడవలకు దిగడం మంచిదేనా అంటూ నిలదీశారు. వివాదాలను పక్కన పెట్టి కలిసిమెలిసి పని చేయాలని సూచించారు.

పీఏసీలో హత్ సే హాత్ జోడోయాత్ర పై సుదీర్ఘంగా చర్చించారు.  పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు ప్రతీ ఒక్కరూ ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం రెండు నెలల పాటు పాదయాత్ర చేయాలని థాక్రే పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *