Monday, March 16, 2026
HomeTrending Newsసదుం మండలంలో పెద్దిరెడ్డి పల్లెబాట

సదుం మండలంలో పెద్దిరెడ్డి పల్లెబాట

Peddireddy- Palle Bata: సదుం మండలంలో పల్లెబాట కార్యక్రమం మొదలైంది. పుంగనూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. నేడు ఆదివారం సదుం మండలంలో ప్రారంభమైన ఈ పల్లెబాట నాలుగు రోజులపాటు మండలంలో కొనసాగనుంది. ఆదివారం తిమ్మానాయునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ నుండి ప్రారంభమైన పల్లెబాట కార్యక్రమంద్వారా నేడు మొత్తం 33 పల్లెల్లో పర్యటిస్తున్నారు. తిమ్మానాయునిపల్లి తో పాటు గొంగివారిపల్లి, అమ్మగారి పల్లి, సదుం, రెడ్డివారిపల్లి, చింతపర్తివారిపల్లి పంచాయతీల పరిధిలో పర్యటన సాగుతోంది.

ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో ఈ పల్లెబాట కార్యక్రమం పూర్తయింది.

Also Read : ఇది ఇంటర్వెల్ మాత్రమే: పెద్దిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular