3 Capital Bill Repeal :

మూడు రాజధానులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి ఇంటర్వెల్ మాత్రమేనని, ఈ అంశం ఇప్పటితో ముగిసిపోయినట్లు కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శుభం కార్డు పడడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు.

అమరావతి రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టుల యాత్రగా పెద్దిరెడ్డి అభివర్ణించారు. రైతుల పాదయాత్ర చూసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదని, సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని స్పష్టం చేశారు.  అమరావతి ఉద్యమాన్ని ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీయే నడిపిస్తోందని, ప్రభుత్వం తీసుకున్న ఉపసంహరణ నిర్ణయం అనేది అమరావతి రైతుల విజయం కాదని తేల్చి చెప్పారు. అమరావతి యాత్ర లక్షమందితో సాగుతుందా అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా తాను మూడు రాజధానులకే మద్దతిస్తానని, వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నందున  వ్యక్తిగతంగా కేబినేట్ భేటికి హాజరు కాలేకపోయానని అందుకే పూర్తి వివరాలు తనకు తెలియవన్నారు.

Also Read :   ‘త్రీ క్యాపిటల్స్’ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *