బాల‌య్య అఖండ సెన్సార్ పూర్తి

Clean Akhanda:

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘అఖండ’. ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ 2న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. సినిమాలో గ్రాండ్ విజువల్స్, డ్రామా బాగుందంటూ సెన్సార్ అధికారులు మేకర్స్‌ ని మెచ్చుకున్నారని చిత్ర‌యూనిట్ తెలియ‌చేసింది. గతంలో ఎన్నో మాస్ మరియు యాక్షన్ రోల్స్ చేసిన బాలకృష్ణ అఖండ మూవీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో వస్తున్నాడు. అయన పోషించిన అఘోర పాత్ర ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది అంటున్నారు.

సెకండాఫ్‌లో అఖండ పాత్ర వస్తుందని తెలిసింది. అఖండ పాత్ర‌లో బాల‌య్య న‌ట‌విశ్వ‌రూపం చూపించారని… మరో వైపు, శ్రీకాంత్ విల‌నిజం మరో హైలైట్‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. జ‌గ‌ప‌తి బాబు ఓ ముఖ్య‌పాత్ర‌ను పోషించారు.  సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ సంగీతం ఈ సినిమాకి ప్ల‌స్ అవుతుంది. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో నిర్మించారు. డిసెంబ‌ర్ 2న రానున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్అవుతుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

ఇవి కూడా చదవండి: ‘అఖండ’ ట్రైలర్ అదిరింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *