Sunday, September 22, 2024
Homeసినిమా‘పెళ్లిసంద‌D’ సెన్సార్ పూర్తి

‘పెళ్లిసంద‌D’ సెన్సార్ పూర్తి

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి రూపొందిస్తోన్న చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన రాఘవేంద్రరావు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌ పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ‘‘సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప్లానింగ్ ప్ర‌కారం చేసుకుంటూ రావ‌డం వ‌ల్ల సినిమా అంద‌రికీ రీచ్ అయ్యింది . ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో, హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్, రీసెంట్‌గా నాగార్జున విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రేపు సెప్టెంబర్ 22న ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్