Pelli Sandad Success Celebrations At Hyderabad
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. రోషన్, శ్రీలీల హీరో, హీరోయిన్లు. కె.రాఘవేంద్రరావు ఈ చిత్రం ద్వారా నటుడిగా ప్రేక్షకులను అలరించడం విశేషం. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్ పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. సూపర్ హిట్ టాక్‌తో వీకెండ్స్ లో ‘పెళ్లి సందD’ చాలా చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
రోషన్ డాన్సులు, యాక్షన్ సన్నివేశాలతో పాటు.. శ్రీలీల గ్లామర్, ఆమెను అందంగా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన తీరు ఆడియెన్స్ ను మెప్పించింది. అలాగే డైరెక్టర్ గౌరి రోణంకి సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా, యూత్ కనెక్ట్ అయ్యేలా ప్రతి ఫ్రేమ్‌ను ఓ కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. ఇంత మంచి విజయాన్ని అందుకున్న పెళ్లి సందD సక్సెస్‌ను సినీ ప్రముఖుల సమక్షంలో ఓ ఫ్యామిలీ ఈవెంట్‌లా సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి సహా టాలీవుడ్‌కి చెందిన స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. రాజమౌళి చేతుల మీదుగా హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీలతో పాటు ఈ చిత్రానికి వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు మెమొంటోలను అందజేశారు.
Also Read : ఆ ‘పెళ్లి సందడి’లా గొప్పగా ఆడాలి, ఆడుతుంది : చిరంజీవి