Monday, June 8, 2026
HomeTrending Newsటైమ్ పాస్ పాలిటిక్స్ నమ్మరు: రోజా

టైమ్ పాస్ పాలిటిక్స్ నమ్మరు: రోజా

don’t time paas: గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ కు ఈసారీ అదే గతి తప్పదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.  తమది పోరాటాల పార్టీ అని, ప్రశ్నిస్తానని చెప్పుకునే పవన్ ఎప్పుడూ ప్యాకేజీల కోసమే పాకులాడుతుంటారని విమర్శించారు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఫుల్ టైం గా పని చేయాలని, ప్రజలకు అండగా ఉండాలని కానీ ఎప్పుడో ఓ సారి వచ్చి, టైమ్ పాలిటిక్స్ చేస్తే ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదని, చివరకు తన సొంత  కులం వారు కూడా విశ్వసించరని పవన్ ను ఉద్దేశించి రోజా అన్నారు.

సిఎం జగన్ తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచి పోయారని రోజా అన్నారు. ఆత్మకూరు ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధికి తెలుగుదేశం, జనసేన మద్దతు ఇస్తాయని, అయినా సరే వైఎస్సార్సీపీ కి బద్వేల్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. నలభై ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు భూమి కొన్నారని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular