Friday, September 20, 2024
HomeTrending NewsYSRCP: లోకేష్ సంస్కారం లేకుండా పెరిగారు : పేర్ని

YSRCP: లోకేష్ సంస్కారం లేకుండా పెరిగారు : పేర్ని

నారా లోకేష్ కు దమ్ముంటే గుడివాడలో కొడాలి నానిపై పోటీచేయాలని మాజీ మంత్రి పేర్నినాని సవాల్ చేశారు.  నిన్న గన్నవరం సభలో  కొడాలి, వంశీలనుద్దేశించి  లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పేర్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుతున్న తీరు చూసి చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు బాధపడుతున్నాయని అన్నారు. ఆ పార్టీ నేతలు కుల జాడ్యంతో, అహంకారంతో, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.  బందర్ పోర్టుపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను సంస్కార హీనంగా పెంచారని విమర్శించారు. లోకేష్ ది యువగళం యాత్ర కాదని యువ గంగాళం అని..లోకేష్ సాయంత్రం సూర్యాస్తమయం సమయం నుంచి తెల్లవారుజాము వరకూ నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. బూతులు తిట్టడం, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

భవిష్యత్తుకు భరోసా అంటూ లోకేష్ మాట్లాడుతున్నారని, తన తండ్రిని నమ్మాలని ప్రజలకు లోకేష్ వివరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రస్తుతం తాము ఇస్తున్న పథకాలకే పేరు మార్చి చెబుతున్నారన్నారు. తమకు ఓటేస్తే ఏమి చేస్తామో చెప్పకుండా ‘నా తండ్రి మంచోడు, నేను మూర్ఖుణ్ణి’ అని చెప్పుకోవడం ఏమిటని నిలదీశారు.  తన తండ్రిని కన్న తండ్రి పేరు కూడా లోకేష్ చెప్పుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

గతంలో సోనియా గాంధీ, చంద్రబాబులు కలిసి జగన్ పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెడితే బాధలు పడ్డారు కానీ, బైటకు రాగానే సోనియాను జైల్లో పెడతా, చంద్రబాబును ఏదో చేస్తా అనే మాట ఎప్పుడూ జగన్ మాట్లాడలేదని… ప్రజలకు ఏమి చేస్తానో మాత్రమే చెప్పారని గుర్తు చేశారు.

వల్లభనేని వంశీని పశువుల డాక్టర్ గా టిడిపి నేతలు మాట్లాడుతున్నారని, మీ పార్టీ తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడు మనుషుల డాక్టర్, దేవతలా డాక్టర్ గా ఉన్నారా అని ప్రశ్నించారు.  కొడాలి నాని మీ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఇన్ఫోసిస్ లో ఇంజనీర్ గా ఉన్నారా అని నాని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన్ను లారీ క్లీనర్ అని, కప్పులు కదిగేవాడని మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  తండ్రీ కొడుకులకు ఆవగింజంత సిగ్గు, దోస గింజంత ఆత్మాభిమానం ఉంటే గుడివాడలో మీకు అభ్యర్ధి ఎవరో చెప్పాలని పేర్ని నిలదీశారు. బట్టలూడదీసి చూసే అలవాటు  ఏమిటన్నారు.

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ షాపులో ఉన్న కిరాణా సరుకులు అమ్ముకోవడం కోసం రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, చంద్రన్న కానుక పథకాలు పెట్టారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్