Sunday, January 19, 2025
HomeTrending Newsఇంటి రుణాలపై చారిత్రక నిర్ణయం: పేర్ని

ఇంటి రుణాలపై చారిత్రక నిర్ణయం: పేర్ని

ఇంటి కోసం రుణాలు తీసుకున్న పేద, మధ్య తరగతి వర్గాల కోసం రాష్ట్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. 1983 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇంటి పట్టాలు కుదువ పెట్టి తెచ్చుకున్న అప్పుతీర్చేందుకు ఒన్ టైం సెటిల్ మెంట్ పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేశారు.

⦿ ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు పొందిన వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రూ.10వేలు, మున్సిపాల్టీకి చెందిన వారు రూ.15వేలు, అర్బన్‌ ప్రాంతాలకు చెందిన వారు రూ.20వేలు చెల్లించేలా సదుపాయం
⦿. పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులైన అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీ కింద రూ.35వేల చొప్పున రుణాలు అదనపు ఆర్థిక సహాయం కింద రుణాలు, తొలి దశలో 15,60,227 ఇళ్ల నిర్మాణం
⦿  రెండో విడత వైఎస్సార్ ఆసరాకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ రెండో విడతలో రూ.6,470 .76 కోట్లను చెల్లించనున్న ప్రభుత్వం
⦿  ఆస్పత్రులు, స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లు పెట్టేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
⦿  డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ 1940 చట్టం సవరణకు కేబినెట్‌ ఓకే
⦿  విశాఖ జిల్లా అరుకు మండలం మజ్జివలస గ్రామంలో ఏకలవ్య మోడల్‌స్కూల్‌ నిర్మాణం కోసం 15ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించేందుకు కేబినెట్‌ ఓకే


⦿  చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం, యాదమర్రి గ్రామంలో 2.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఐఓసీఎల్, కేటాయింపు
⦿  వైయస్సార్‌ జిల్లా, రాయచోటి మండలం మాసాపేట గ్రామంలో యోగివేమన యూనివర్శిటీ పీజీ సెంటర్‌ ఏర్పాటుకోసం 53.45 ఎకరాల భూమిని కేటాయింపు
⦿  గుంటూరు వెస్ట్‌ మండలం అడవి తక్కెళ్లపాడులో షటిల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్ కోసం 2 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం
⦿  గుంటూరుజిల్లా చిలకలూరి పేట మండలం ఎడవల్లిలో 223 ఎకరాల భూమి ఏపీఎండీసీకి కేటాయింపు.
⦿  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌ మున్సిపాల్టీ పరిధిలో 31 సెంట్లను కమ్యూనిటీ హాలు, విద్యాసంస్థ నిర్మాణానికి మైనార్టీ వెల్ఫేర్‌ డిపార్ట్ మెంట్‌కు కేటాయిస్తూ నిర్ణయం
⦿  శ్రీశైలంలో శ్రీశైల జగద్గురు పండితారాధ్య సేవాసమితి ట్రస్ట్‌కు 10 ఎకరాల భూమి 33 ఏళ్ల లీజుకు గజం రూ.10ల చొప్పున కేటాయింపు
⦿  ఏపీ ఫాస్టర్‌ కేర్‌ గైడ్‌లైన్స్‌ 2021కి కేబినెట్‌ ఆమోదం
⦿  నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మైక్రోసాఫ్ట్‌ కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం
⦿  రాయలసీమ కరవు నివారణ లో భాగంగా హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్‌–2లో భాగంగా పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ వరకూ రూ.1929 కోట్లతో విస్తరించనున్న పనులకు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలనుంచి మినహాయింపునకు కేబినెట్‌ ఓకే
⦿  ఇక మైనార్టీ వర్గాలకూ సబ్‌ ప్లాన్‌
⦿  వైయస్సార్‌ జిల్లా కాశినాయన మండలంలో లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
⦿  సీఐడీకి అదనపు హోంగార్డు పోస్టులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
⦿  శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
⦿  ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్