Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మరో ప్రస్థానం’ మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ‘మరో ప్రస్థానం’ సినిమా ఉంటుంది. నటీనటుల పర్మార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో కొత్తదనం చూస్తారు. అతి తక్కువ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం. లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఈ నెల 24న థియేటర్ ల ద్వారా మరో ప్రస్థానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు మనసుపెట్టి కష్టపడి పని చేశారు. ఇలాంటి సినిమాలు రియల్ గా చాలా అరుదుగా వస్తుంటాయి. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ.. నా గత చిత్రం ‘అంతకు మించి’ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొత్త తరహా కథతో సినిమా చేయాలని ‘మరో ప్రస్థానం’ కథను డిజైన్ చేసుకున్నాను. నా కథ నచ్చి నిర్మాతలు వెంటనే సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. సింగిల్ షాట్లో  కమర్షియల్ సినిమా తీసి అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చేయలనుకుని ఈ కథను రాసుకొన్నాను. ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడమే మెయిన్ టార్గెట్. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల్లా షూటింగ్  జరగలేదు. ఫస్ట్ రిహర్సల్  చేసుకుని తర్వాతనే షూట్ చేయడం జరిగింది. తెలుగు రాకున్నా ముస్కాన్ సేథీ చాలా కష్టపడి చాలా డెడికేషన్ తో వర్క్ చేసింది. అందరూ ఈ సినిమాకి మనసు ప్రాణం పెట్టి కష్టపడి పని చేశారు. అందుకే అవుట్ ఫుట్ బాగా వచ్చింది. కబీర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీరో తనీష్ గారికి మోకాలు ఆపరేషన్ అయినా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. మరో ప్రస్థానం సినిమాలో  హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. మా సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరో తనీష్ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది . మేము చాలా కష్టపడి ‘మరో ప్రస్థానం’ సినిమా చేయడం జరిగింది ఈ సినిమా చూస్తే మా కష్టం మీకే తెలుస్తుంది. ప్రతి యాక్టరు ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటూ సినిమాలు చేస్తారు. నేనూ మరో ప్రస్థానం చిత్రాన్ని అలాగే చేశాను. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది.  ఈ సినిమాలో ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న వాస్తవ ఘటనలు, బర్నింగ్ ఇష్యూస్ చూపిస్తున్నామని అన్నారు.

హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ.. మరో ప్రస్థానం చిత్రంలో ఫస్ట్ టైం  ఛాలెంజింగ్ పాత్రలో నటించాను. వన్ షార్ట్ ఫిలిం లో నటించే ఈ సినిమా నాకు వెరీ స్పెషల్ మూవీ. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com