Babu- Record: విజయవాడలో గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు తిరుగుతున్నారని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 2004, 2009లో రెండుసార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారని, అలాగా వైఎస్ తనయుడు జగన్ చేతిలో 2019 ఓటమి పాలయ్యారని, 2024లో కూడా మరోసారి అయన ఓటమి చెందడం ఖాయమని పేర్ని ధీమా వ్యక్తం చేశారు. తండ్రి చేతిలో రెండుసార్లు, కొడుకు చేతిలో రెండుసార్లు ఓటమి పాలైన నేతగా చంద్రబాబు గిన్నీస్ రికార్డ్ సాధించబోతున్నారని, ఈ రికార్డు కోసం ఆ ప్రతినిధులు విజయవాడలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా దుష్ప్రచారం అంశంపై పార్టీ ప్లీనరీలో పేర్ని ప్రసంగించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలం తామంతా శాశ్వతం కాదని, నాయకుడు జగన్, ఆయన్ను అభిమానిస్తున్న కార్యకర్తలే శాశ్వతమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 7వ తేదీ వరకూ తాను మంత్రిగా ఉన్నానని, తర్వాతా మాజీ అయ్యానని గుర్తు చేశారు. కార్యకర్తలను నాయకులు ఎవరైనా విస్మరిస్తే అలాంటి నేతలను సిఎం జగన్ స్వయంగా పక్కకు తప్పిస్తారని, వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇవ్వరని, ఇదే విషయాన్ని అయన తమకు చెప్పరనినాని వెల్లడించారు.
ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా ప్రతిరోజూ చంద్రబాబు, ఆయనకు మద్దతిస్తున్న ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని, వీరికి దత్తపుత్రుడు కూడా తోడయ్యారని విమర్శించారు. జగన్ ఎవరికీ దడిచే రకం కాదని, అన్నిపార్టీలు, అందరూ కలిసి వచ్చినా ఏమీ చేయలేరని, వచ్చే ఎన్నికల్లో కార్యకర్తల అభిమానం, ప్రజల ఆశీస్సులతో మళ్ళీ విజయం సాధిస్తారని నాని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : ఆంధ్రా తాలిబన్లు టిడిపి నేతలు: పేర్ని