Sunday, January 19, 2025
Homeసినిమా‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి మరో సాంగ్

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి మరో సాంగ్

నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి‘. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. నాలుగు పాటలు, నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక్ అందించగా.. ఒక పాట వివేక్ సాగర్ స్వరపరచడం విశేషం. కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘కనుల చాటు మేఘమా’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన కఫీఫీ పాట విడుదలైంది.

కఫీఫీ అంటూ అందరూ కాలు కదిపేలా అద్బుతమైన బాణీ సమకూర్చారు వివేక్. నలుగురిలో ఉంటే.. చిలిపిగ పోతుంటే.. చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ అంటూ పాట సాగింది. పాట సందర్భానికి, బాణీకి తగ్గట్లుగా కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం అందంగా, అర్థవంతంగా ఉంది. “ఇది అది కాదంటూ.. వివరము వేరంటూ.. పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ”, ” పరిధులు లేని వింత సహవాసం పరిగెడుతుంటే తగదుగా” అంటూ మళ్లీ మళ్లీ పాడుకునేలా క్యాచీ లిరిక్స్ తో లోతైన భావాన్ని పలికించారు. గాయకులు బెన్ హ్యూమన్, విష్ణుప్రియ తమ మధుర గాత్రంతో పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపించారు.

‘కఫీఫీ’ సాంగ్ ఎంత ఎనర్జిటిక్ గా సాగిందో.. లిరికల్ వీడియోలో నాయకానాయికలు నాగశౌర్య, మాళవిక అంతకంటే ఎనర్జిటిక్ గా కనిపించారు. పబ్ లో జరుగుతున్న పార్టీలో స్నేహితులతో కలిసి నాయకానాయికలు ఉత్సాహంగా చిందేయడం అలరిస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి డ్యాన్స్ చేస్తున్నారు. పాటలోని ఉత్సాహాన్ని, నాయకానాయికలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ యశ్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ పాటకి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభించడం ఖాయమనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్