Monday, June 8, 2026
Homeసినిమాలండన్ లో 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి'

లండన్ లో ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’

విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు… వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాల పై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది. ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఇది. దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మిస్తోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఆమధ్య యువ కథానాయకుడు నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుపుకుంటోంది. నాయక, నాయిక లతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్రీకరణ జరుగుతోంది. ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ గల సాంకేతిక వర్గంతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది అని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular