కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీని నిషేధించారు. బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ విషయాన్ని ఇవాళ ప్రకటించింది. కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధిస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఆ వార్నింగ్‌కు చెందిన పోస్టర్లను ఆలయం వద్ద పోస్టు చేశారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయడం కానీ, వీడియో రికార్డింగ్ కానీ చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లతో ఆలయ పరిసరాల్లోకి ఎవరూ ప్రవేశించరాదు అని, సీసీటీవీ కెమెరాల నిఘా ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వద్ద ఇటీవల ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. ఆ వీడియో ఒకటి వైలర్ అయ్యింది. ఇంటర్నెట్‌లో దాని గురించి తీవ్ర చర్చ కూడా సాగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొన్నది. వీడియోలు, రీల్స్‌పై దృష్టి పెట్టడం వల్ల మత పవిత్రత దెబ్బతీనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.