Sunday, June 14, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్Pilli Bose: ఆవేదనతోనే అలా మాట్లాడా: పిల్లి

Pilli Bose: ఆవేదనతోనే అలా మాట్లాడా: పిల్లి

తాను పార్టీ మారాల్సిన అవసరంలేదని, జనసేన వైపు వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో సిఎం జగన్ సమగ్ర  సర్వే చేయిస్తున్నారని, ఆ నివేదిక ఆధారంగా టికెట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని బోస్ వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదన్నారు. రామచంద్రాపురంలో బోస్ మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్సీపీ తన చేతుల మీదుగా నిర్మాణం జరిగిన పార్టీ, అని ఇది తన పార్టీ అని, తాను ఒక పిల్లర్ లాంటివాడినని పునరుద్ఘాటించారు. జరుగుతున్న వాస్తవ పరిస్థితులను సిఎం జగన్ కు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తాను మాట్లాడాల్సి వచిందని అన్నారు.  మంత్రితో కలిసి పనిచేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు … ‘ఆయన పని ఆయన చేస్తాడు, మా పని మేము చేస్తుకుంటా’మంటూ  సమాధానమిచ్చారు.పార్టీ కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయబోమన్నారు.

సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించవద్దని జగన్ సూచించారని బోస్ చెప్పారు. కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నప్పుడు వారిని ఓదార్చవలసిన బాధ్యత తనపై ఉందని, వారి  ఆవేదన వల్లే ఆ స్థాయిలో మాట్లాడాల్సి వచ్చిందని, అవసరమైతే ఎంపి పదవికి రాజీనామా చేస్తానని చేసిన ప్రకటన బాధాకరమని, ఈ విధంగా మాట్లాడినందుకు సిఎం జగన్ కు క్షమాపణ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular