Thursday, March 19, 2026
Homeసినిమాఆగష్టు 20 న ‘ప్లాన్-బి’ విడుదల  

ఆగష్టు 20 న ‘ప్లాన్-బి’ విడుదల  

శ్రీనివాస్ రెడ్డి హీరోగా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, నవీనారెడ్డి ముఖ్య తారాగణంగా ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్  చిత్రం ‘ప్లాన్-బి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 20 న విడుదలకు సిద్ధంగా ఉంది.

“ప్లాన్ బి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠతో థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు అంత ఉత్కంఠం గా ఉంటుంది.  మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి  సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి, మురళి శర్మ, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని ఆగష్టు 20 న విడుదల చేస్తున్నాము” అని రాజమహి తెలిపారు.

నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ… “మా ప్లాన్ బి చిత్రం సెన్సార్ పూర్తయ్యింది, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.  ఆగష్టు 20 న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular