People You’ll Find In Every Whatsapp Groups

ఈరోజుల్లో గుండె లేకుండా మనిషి బతకగలడేమో కానీ – సెల్లు లేకుండా బతకలేడు. అందులో వాట్సాప్ లేకపోతే అసలు బతకలేడు. ఒకరు ఎన్ని గ్రూపుల్లో ఉంటారు? గ్రూపుల్లో స్వభావాన్ని బట్టి సభ్యులను ఎన్ని రకాలుగా విభజించవచ్చో ఎవరో అంచనా వేశారు. సీరియస్ గా కాకుండా, సరదాగా చదువుకుని…మీరిందులో ఏ కోవలో ఉంటారో మీకు మీరే తెలుసుకోండి.

1. కుప్పరులు: Info Tsunami
వీరు రోజంతా కుప్పలు తెప్పలుగా సమాచారాన్ని గ్రూపుల్లో కుమ్మరిస్తూ ఉంటారు.

2. ఆకస్మికులు: Once in a blue moon
వీరు జన్మకో శివరాత్రి టైపులో తమ ఉనికిని తెలపడానికి అప్పుడప్పుడు ఆకస్మికంగా కనిపించి మాయమవుతూ ఉంటారు.

3. విధ్యుక్తులు: Duty minded
వీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళలో శుభోదయం, శుభరాత్రి లాంటి సమాచారాలు, లేదా పుట్టిన రోజు శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు లాంటివి మాత్రమే సమూహంలో పెడుతుంటారు. వీరివల్లే గడియారాలు నామరూపాల్లేకుండా మాయమై పోయాయి.

4. గవాక్షులు: Silent Spectators
వీరు సమూహంలో ఏమి జరుగుతోందో చూస్తారు కానీ- పొరపాటున కూడా స్పందించరు. బహుశా వీరికి సాంకేతిక పరిజ్ఞానం కానీ, భాషా పరిజ్ఞానం కానీ లోపించి ఉండవచ్చు. లోపించకపోతే ఇతరేతర సిగ్గు, మొహమాట, భయాలు ఉండి ఉండవచ్చు.

5. అవ్యవస్థితులు: Unorganized
వీరు అనేక సమూహాల్లో సభ్యత్వం కలిగి ఉండడంతో ఏ సమాచారం ఎవరికి, ఎప్పుడు పంపాలో తెలియని అయోమయావస్థలో ఉండి, తను ప్రస్తుతం ఉన్న సమూహంలోనే అప్పటికే వెయ్యిసార్లు ఫార్వార్డ్ అయినదాన్నే మళ్లీ మళ్లీ పంపుతూ ఉంటారు.

6. అనుక్రియాయులు: Running Comments
వీరు గ్రూపులో వచ్చిన ప్రతి విషయానికి తమ వ్యాఖ్య జోడించి పంపుతూ ఉంటారు.

7. తంత్రజ్ఞులు: Mind game Players
వీరు తమ సమాచారంతో అందరూ ఏకీభవించాలని ఆశిస్తారు.

8.పృథక్ లు: No Identity
సమూహంలో వీరి ఉనికి మిగతా సభ్యులెవరికి తెలియదు. తామరాకు మీది నీటి బొట్టులాగా ఉంటారు. ఉన్నా ఉన్నట్లు తెలీకుండా ఉండిపోతారు.

9. అసంబద్ధులు: Irrelevant
సమయం, సందర్భం తెలియనివారు. ఎప్పుడేమి పెడతారో వారికే తెలియదు.

10. తస్కరులు: Copy Paste
ఇంతకు ముందే ప్రచురితమైన సమాచారాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తూ ఉంటారు.

11. రవాణాగ్రేసరులు: Only Forward
ఫార్వార్డ్ మాత్రమే చేసే వారు.

12. కోపాగ్రేసరులు: Left- Exit- Delete
వీరు గ్రూపులో వచ్చే అన్ని విషయాల మీద కోప్పడి, చిటపడలాడాల్సిన బాధ్యత తమ మీద ఉందని అనుకుంటూ ఉంటారు. చర్చ వేడెక్కి చాలాసార్లు వీరు గ్రూపు నుండి లెఫ్ట్ అంటే వాకవుట్ అవుతుంటారు. లేదా అడ్మిన్ లు వీరిని డిలిట్ చేస్తుంటారు.

ఇంకా వాట్సాప్ గ్రూప్ పరిభాషకు అందని ఎందరో ఉంటారు. వారికి ఇలా గౌరప్రదమయిన బిరుదు నామాలు పెట్టలేదని బాధపడాల్సిన పనిలేదు. ఎవరి నామాలు వారే పెట్టుకోవాలి. నామం ఇంకొకరు పెడితే మోసం- నిందార్థకం. ఎవరికి వారే పెట్టుకుంటే అలంకారం- గౌరవం!

(అజ్ఞాత రచయిత రాయగా, వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతున్న ఒకానొక పోస్టు. భావాన్ని యాతథంగా వాడుకుని, భాషను మాత్రం కొద్దిగా సంస్కరించాల్సి వచ్చింది)

Also Read : గృహ హింసకు గూగుల్ పాఠం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *