Monday, February 24, 2025
HomeTrending Newsకార్మికులతో కలిసి ప్రధాని భోజనం

కార్మికులతో కలిసి ప్రధాని భోజనం

 Kashi Vishwanath Char Dham  : కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. మోడీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవానికి ముందుగా త్రినేత్ర రుద్రాక్ష మాల కు నమస్కరించి, వారణాశిలోని గంగా నదిలో పవిత్ర స్నానమాచరించారు . అనంతరం ఆయలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్తోన్నారు.

కారిడార్ ప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి కాశీ నగర ప్రజలు దారిపొడవునా హర హర మహాదేవ్ అంటూ పెద్దఎత్తున స్వాగతం పలికారు. కాశీ విశ్వనాథ్ ధామ్‌ నడవా నిర్మాణం పూర్తి చేసిన కార్మికులపై మోడీ స్వయంగా పూలు జల్లి అభినందించారు. వారితో కలిసి ఫోటో దిగారు, అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Also Read : కాశీ ఆలయ కారిడార్ నేడు ప్రారంభోత్సవం

RELATED ARTICLES

Most Popular

న్యూస్