Friday, March 13, 2026
Homeజాతీయంబిపిన్‌ రావత్‌ నిజమైన దేశభక్తుడు: మోదీ

బిపిన్‌ రావత్‌ నిజమైన దేశభక్తుడు: మోదీ

PM condoled:
ఆర్మీ హెలికాప్టర్‌ దుర్ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనికులు మృతిచెందడం పట్ల ప్రధాని తీవ్ర విచారం వెలిబుచ్చారు.  వీరంతా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడుతూ బిపిన్‌ రావత్‌తో ఉన్నఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ గొప్ప సైనికుడు.. నిజమైన దేశభక్తుడని కొనియాడారు. సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్నిఆదునీకరించడంలో గొప్పగా కృషిచేశారన్నారు. వ్యూహాత్మక అంశాలపై ఆయన సామర్థ్యం, దృక్పథం అసాధారణమైందన్నారు. అలాంటిగొప్ప వ్యక్తి మరణం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు.

Also Read : బిపిన్ రావత్ ఇక లేరు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular