క్రీడల్లో ఇండియాకు ఇప్పుడే స్వర్ణ యుగం మొదలైందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఉరకలు వేసే యువ శక్తితో ఇండియా క్రీడారంగంలో సత్తా చాటుతోందని కొనియాడారు. కామన్ వెల్త్ క్రీడల్లో ఇందిఆకు పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని మోడీ ఢిల్లీ లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. అధ్బుతమైన ప్రతిభ చూపినందుకు అభినందించారు.
క్రీడాకారులందరూ తమ బిజీ షెడ్యూల్ లో తీరిక చేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర భారతీయుల్లాగే తానుకూడా మీ విజయాల పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. గత కొద్ది వారాల్లో ఇండియా రెండు చారిత్రిక క్రీడా సన్నివేశాలను చూసిందని వాటిలో ఒకటి కామన్ వెల్త్ గేమ్స్ అయితే రెండవది చెస్ ఒలింపియాడ్ అని చెప్పారు. చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇవ్వడమే కాక ఈ ఆటలో తమకున్న పట్టును భారత ఆటగాళ్ళు మరోసారి నిరూపించారని కితాబిచ్చారు.
కామన్ వెల్త్ కు వెళ్ళే ముందే…. విజయంతో తిరిగి వచ్చిన తరువాత సెలెబ్రేట్ చేసుకుందాం అని తాను చెప్పిన విషయాన్ని మోడీ ఆటగాళ్లకు గుర్తు చేశారు. గతంలో పోల్చితే నాలుగు సరికొత్త క్రీడల్లో ఇండియా తన ప్రతిభ చాటిందని.. లాన్ బౌల్స్ లాంటి ఆటలో గోల్డ్ మెడల్ సాధించడం అపురూపమని అభినందించారు.
Also Read : మోడీతో భేటీపై నిఖత్ ఉత్సుకత