Saryu National Project launched:
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేడు ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లో పర్యటించారు. సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించారు. 9,082 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా 14 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర జలనవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
1978లోనే ఈ ప్రాజెక్టుకు రూప కల్పన జరిగినప్పటికీ ఇన్నేళ్ళకు ఈ ప్రాజెక్టు కల సాకారమైంది. బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించకపోవడం, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2016లో ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం గాడిలో పడింది. నిర్ధిష్ట కాలపరిమితితో ఈ ప్రాజెక్టును 2019 డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కోవిడ్ నేపథ్యంలో పనులకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా సాగాయి. నేడు ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రారంభించడంతో యాభై ఏళ్ళ నాటి కల సాకారమైంది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ రానున్న తరుణంలో ప్రధాని ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవలి కాలంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం చుడుతున్నారు.
Also Read :పూర్వాంచల్ రహదారి జాతికి అంకితం