Saturday, November 23, 2024
HomeTrending Newsమత పర్యాటకంతో ఉపాధి: మోడీ

మత పర్యాటకంతో ఉపాధి: మోడీ

మత పర్యాటకాన్ని పటిష్టం చేయాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని అయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ సోమనాథ్ దేవాలయానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు పారంభోత్సవాలు, కొత్త పనులకు శంక్షుస్థాపనలు వర్చువల్ పద్ధతిలో చేశారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ సోమనాథ్ దేవాలయం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమని, లక్షలాది భక్తులు దర్శించుకుంటారని, ఇలాంటి పుణ్యక్షేత్రాలను మరింత అభివృద్ది చేయడం ద్వారా యువతకు ఉపాధి తో పాటు స్థానిక ఎకానమీ కూడా వృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. సోమనాథ్ ఆలయ పునరుజ్జీవ పనులను ప్రారంభించడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నో సార్లు సోమనాథ్ ఆలయాన్ని కొందరు పాలకులు ధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారని, ఆలయ ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి కుటిల యత్నాలు చేశారని… కానీ అన్ని కాల పరీక్షలనూ తట్టుకొని, మన గత వైభవానికి, సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకగా ఈ ఆలయం నిలిచి ఉందని మోడీ వివరించారు.

తాము ప్రస్తావిస్తున్న ‘భారత్ జోడో ఆందోళన్’ కేవలం భౌగోళిక, సైద్ధాంతిక ఐక్యతకు సంబంధించినది మాత్రమే కాదని మన చరిత్రను కాపాడేందుకు కంకణ బద్ధులమై ఉండడం కూడా దీనిలో భాగమేనని స్పష్టం చేశారు. తాము ఆలోచించే సరికొత్త భారత్ లో రామాలయం ఓ మూలస్థంభంగా ఉంటుందని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి అగ్ర నేత ఎల్కే అద్వాని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్