Monday, March 9, 2026
HomeTrending Newsఎంపీలకు పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌ ఆతిథ్యం

ఎంపీలకు పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌ ఆతిథ్యం

పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.

బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలను ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు. పలువురికి ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది. వారు అక్కడకు చేరుకోగానే ‘నేను మిమ్మలని శిక్షించబోతున్నా నాతో రండి ” అంటూ లిఫ్ట్ లో వారిని తీసుకు వెళ్ళారు. తీరా లిఫ్ట్ క్యాంటీన్ దగ్గర ఆగింది. సదరు ఎంపీలు ఆశ్చర్యానికి గురయ్యారు. సీనియర్ ఎంపి ఎన్ కే ప్రేమ్ చంద్రన్, కేంద్రమంత్రి మురుగన్, బీజేపీ ఎంపీలు హీనా గవిట్, జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, S. ఫాంగ్నాన్ కొన్యాక్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే,  బిజెడి ఎంపి సష్మిత్ పాత్రా  తదితరులు ప్రధానితో కలిసి భోజనం చేశారు.

దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన లంచ్‌ భేటీలో పలు అంశాలపై ముచ్చటించారు. విదేశీ పర్యటలు, వ్యక్తిగత విషయాలను మోడీ పంచుకున్నట్లు తెలిసింది. తనతో పాటు ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular