Saturday, January 18, 2025
Homeజాతీయంఆక్సిజన్ ఉత్పత్తిలో పురోగతి : మోడీ

ఆక్సిజన్ ఉత్పత్తిలో పురోగతి : మోడీ

కరోనాను ఎదుర్కోవడంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కృషి అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు.  కరోనా కట్టడి చేయడంలో సమర్ధంగా పని చేస్తున్నామని చెప్పారు. కరోనా రోగులకు కావాల్సిన ఆక్సిజన్ తయారీలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. మామూలు రోజుల్లో 900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను తయారు చేస్తుండగా, ప్రస్తుతం 10 రెట్లు అదనంగా 9,500 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.

కోవిడ్ రెండో దశలో దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం పెద్ద సవాల్ గా మారిందని, కానీ క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల డ్రైవర్ల నిర్విరామ కృషి ఫలితంగా యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ ను దేశంలోని అన్ని ప్రాంతాలకూ చేర్చగాలిగామని వివరించారు. ఆర్మీ కూడా ఆక్సిజన్ సరఫరాలో కీలక భూమిక పోషించిందని కొనియాడారు.

కోవిడ్ మొదట వచ్చినప్పుడు దేశంలో కేవలం ఒక్క లాబ్ మాత్రమే ఉండేదని, కానే నేడు దేశవ్యాప్తంగా 2,500  లాబ్ లు పనిచేస్తున్నాయని మోడీ వివరించారు. మొదట్లో రోజుకి కేవలం వందల సంఖ్యలో మాత్రమే కోవిడ్ టెస్టులు జరిగేవని, నేడు 20 లక్షల పరీక్షలు రోజుకు చేయగలుగుతున్నామని చెప్పారు.

కేంద్రంలో బిజెపి పాలన ఏడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ నినాదం ‘ సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ కు కట్టుబడి ఉన్నామని మోడీ పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్