Thursday, January 23, 2025
HomeTrending Newsఅధికారులదే కీలక పాత్ర : ప్రధాని

అధికారులదే కీలక పాత్ర : ప్రధాని

కరోనా పై పోరులో జిల్లా స్థాయి అధికారులే క్షేత్ర స్థాయి కమాండర్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జిల్లాల్లోని పరిస్థితులు వారికి బాగా తెలుసన్నారు. కరోనా నుంచి ప్రతి ప్రాణాన్ని కాపాడడం కోసమే మన పోరాటమని మోడీ అభిప్రాయపడ్డారు.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న 10 రాష్ట్రాలలోని 50 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. కరోనా కట్టడిలో అధికారులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మోడీ అభినందించారు. కర్ణాటక, బీహార్, అసోం, చండీగడ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.

వాక్సిన్ అనేది కరోనాతో పోరాడే ఒక శక్తివంతమైన సాధనమని…. లోకల్ కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, టెస్టులు వేగవంతం చేయడం, ప్రజలకు సరైన సమాచారం అందించడమే మన ఆయుధాలని మోడీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాక్సిన్ సరఫరా పెంచేందుకు కృషి చేస్తున్నామని, దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పేందుకు పిఎం కేర్స్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్