Saturday, January 18, 2025
Homeజాతీయంఇకపై ‘పీపుల్స్ పద్మ’ అవార్డులు : మోడీ

ఇకపై ‘పీపుల్స్ పద్మ’ అవార్డులు : మోడీ

పద్మ అవార్డులకు ప్రజలు కూడా తమ నామినేషన్లు పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.  దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన వ్యక్తులు క్షేత్ర స్థాయిలో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని, కానీ వారు వెలుగులోకి రావడం లేదని ప్రధాని అభిప్రాయపడ్డారు. వారికి సముచిత గౌరవం దక్కాలంటే అలాంటివారిని పద్మ అవార్డులకు నామినేట్ చేయాలని దేశ ప్రజలను కోరారు.  మారుమూల ప్రాంతాల్లో ఉంటూ తాము ఎంచుకున్న రంగంలో అద్వితీయమైన ప్రతిభతో ఎంతో మంది రాణిస్తున్నారని, వారి పేర్లను సెప్టెంబర్ 15లోగా ‘పీపుల్స్ పద్మ’ పురస్కారాలకు పంపాలన్నారు. దీనికోసం https://padmaawards.gov.in., https://applypadma.mha.gov.in/publicsite/login.aspx సైట్ కు వెళ్లి నామినేట్ చేయ‌వ‌చ్చని తెలిపారు.

దేశంలో వివిధ రంగాల్లో ప్రతిభ, కృషి చూపే వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో ప్రతియేటా సత్కరిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులకు ఎంపిక కోసం ప్రధాని కొంతమంది నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడు కమిటీ తోపాటు ప్రజలు కూడా ఈ పురస్కారాలకు నామినేట్ చేసే అవకాశం కల్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్