Thursday, April 17, 2025
HomeTrending Newsఇక్రిశాట్ లో ప్రధాని మోడీ

ఇక్రిశాట్ లో ప్రధాని మోడీ

PM at ICRISAT: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్రిశాట్ కు చేరుకున్న ప్రధాని ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక్రిశాట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. నూతన లోగోను కూడా ఆవిష్కరించారు. సంస్థ అభివృద్ధి చేస్తోన్న నూతన వంగడాల ఆవిష్కరణలపై  శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు.  ప్రధాని తో పాటు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి  నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు.

అయితే, సిఎం కెసియార్ జ్వరం కారణంగా శంషాబాద్ లో ప్రధానిని ఆహ్వానించలేకపోయారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోడీకి స్వగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందరరాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేంద్ర రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి నేతలు కూడా ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్